April 2026 General Conference

ఏప్రిల్ 2026 సర్వసభ్య సమావేశము యొక్క నాయకత్వ సమావేశంలో నూతన ప్రాంతీయ డెబ్బదులు ఆమోదం పొందాయి

cf043c9e9ef28f8264eefa04160900f270800012.jpegDOWNLOAD

గురువారం, ఏప్రిల్ 2, 2026న జరిగిన సర్వసభ్య సమావేశము యొక్క నాయకత్వ సమావేశంలో, 91 మంది నూతన ప్రాంతీయ డెబ్బదులను ప్రకటించి, ఆమోద ఓటు కోసం ప్రవేశపెట్టారు. క్రింది ప్రాంతీయ డెబ్బదులు 2026, ఆగష్టు 1న లేదా ముందుగా విడుదల చేయబడతారు:

 ప్రాంతీయ డెబ్బదులు అనగా, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క నాయకులు, వీరు “ప్రత్యేక సాక్షులుగా” ఉండటానికి మరియు వారికి కేటాయించిన ప్రాంతాలలో “సంఘమును నిర్మించుటకును, సమస్త కార్యములను క్రమపరచుటకును” మరియు “సువార్తను ప్రకటించుటకును, పరిపాలించుటకును” పన్నెండుమంది అపొస్తలుల సమూహానికి సహాయం చేయడానికి ప్రథమ అధ్యక్షత్వము చేత పిలువబడ్డారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 107:25, 34, 38). వారు పన్నెండు మంది అపోస్తలుల సమూహం యొక్క ఆదేశాలు మరియు నిర్దేశాల క్రింద పనిచేస్తారు.

ప్రాంతీయ డెబ్బదులను నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాలలో సేవ చేయడానికి పిలిచి నియమిస్తారు, కానీ అవసరాన్ని బట్టి ఇతర ప్రాంతాలలో సేవ చేయడానికి కూడా వారిని కేటాయించవచ్చు. వారిని పూర్తికాలపు సేవకు పిలవరు మరియు సాధారణంగా వారు ఐదు సంవత్సరాలు సేవ చేస్తారు.

డెబ్బదులు అందరికీ సమాన అధికారం ఉన్నప్పటికీ, కొందరిని ప్రధాన అధికారులుగా, మరికొందరిని ఏరియా ప్రాంతీయ డెబ్బదులుగా నియమిస్తారు.

నాల్గవ సమూహం యొక్క డెబ్బది.

ఆసియా ప్రాంతం

పీటర్ బుషి, 46, బ్యాంకాక్, థాయిలాండ్; ప్రస్తుతం బ్యాంకాక్ థాయిలాండ్ వెస్ట్ స్టేక్‌లో దేవాలయ సన్నాహక బోధకుడిగా సేవ చేస్తున్నారు; గతంలో శాఖా అధ్యక్షుడిగా, బిషప్పుగా, జిల్లా అధ్యక్షత్వ సలహాదారుడిగా, ప్రధాన సలహాదారుడిగా, మిషను అధ్యక్షత్వ సలహాదారుడిగా, మిషను అధ్యక్షుడిగా, మరియు స్టేక్ అధ్యక్షత్వ సలహాదారుడిగా సేవలు అందించారు; భార్య: కమలాక్షి; ముగ్గురు పిల్లలు.

థిన్ ఫుక్ ఫాన్, 41; ఇటీవల జిల్లా అధ్యక్ష పదవి నుండి విడుదలయ్యారు; గతంలో శాఖా అధ్యక్షత్వ సలహాదారుడిగా మరియు శాఖా అధ్యక్షుడిగా సేవలు అందించారు; భార్య: ను జువాన్ క్వెన్; ఇద్దరు పిల్లలు.

క్రింది ప్రాంతీయ డెబ్బదులు 2026, ఆగష్టు 1న లేదా ముందుగా విడుదల చేయబడతారు:

నాల్గవ సమూహం యొక్క డెబ్బది.

ఆసియా ప్రాంతం

రాస్ ఎ. చిలెస్

జాన్ గుట్టి