2026, ఏప్రిల్ 4-5 తేదీలలో నిర్వహించబడుతున్న యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క 196వ వార్షిక సర్వసభ్య సమావేశము కొరకు ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది సమకూడుతారు. యూటాలోని సాల్ట్ లేక్ సిటీలో ఉన్న సమావేశ కేంద్రం నుండి ప్రారంభమయ్యే ఈ రెండు రోజుల కార్యక్రమంలో, యేసు క్రీస్తు యొక్క జీవితం మరియు బోధనలను కేంద్రంగా చేసుకుని నిరీక్షణ మరియు శాంతి సందేశాలు అందించబడతాయి.
ఈ సంవత్సరం సభ్యసమావేశంఈస్టర్ ఆదివారం నాడు ఉన్నందువల్ల, సందేశాలలో అనేకం సహజంగానే ఈస్టర్ యొక్క ప్రధానాంశమైన యేసు క్రీస్తు యొక్క వాస్తవ పునరుత్థానం, ఆయన అనంతమైన ప్రాయశ్చిత్తం, మరణంపై ఆయన సాధించిన విజయం మరియు ఆయన ద్వారా లభించే నిరీక్షణ, పునరుద్ధరణ మరియు శాంతి వంటి అంశాలపై కేంద్రీకృతమవుతాయి. రక్షకుడు జీవిస్తున్నందున, వ్యక్తులు మరియు కుటుంబాలు తమ శిష్యత్వంలో బలం, ఉద్దేశ్యం మరియు ఆనందాన్ని పొందగలరని సంఘ నాయకుల ప్రసంగాలు సాక్ష్యమిస్తాయి.
-
2025, ఏప్రిల్ 6న యూటాలోని సాల్ట్ లేక్ సిటీలో ఉన్న సమావేశ కేంద్రంలో జరిగిన 195వ వార్షిక సర్వసభ్య సమావేశం యొక్క ఆదివారం మధ్యాహ్నకాల సభకు సుమారు 21,000 మంది హాజరయ్యారు.
-
2025, అక్టోబరు 5వ తేదీ ఆదివారం నాడు జరిగిన సర్వసభ్య సమావేశపు ఉదయకాల సభ సమయంలో, యూటాలోని సాల్ట్ లేక్ సిటీలో ఉన్న సంఘ ప్రధాన కార్యాలయం వద్దనున్న సమావేశ కేంద్రంపై సూర్యోదయం అవుతోంది.
-
సమావేశానికి హాజరయ్యేవారు 2025, ఏప్రిల్ 6న యూటాలోని సాల్ట్ లేక్ సిటీలో ఉన్న టెంపుల్ స్క్వేర్లోని సమావేశ కేంద్రంలో సర్వసభ్య సమావేశం యొక్క ఆదివారం ఉదయకాల సభకు ముందుగానే సమకూడారు.
-
సమావేశానికి హాజరయ్యేవారు 2025, ఏప్రిల్ 6న యూటాలోని సాల్ట్ లేక్ సిటీలో జరిగిన సర్వసభ్య సమావేశం యొక్క ఆదివారం ఉదయకాల సభకు ముందుగానే సమావేశ కేంద్రానికి నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యం.
-
న్యూజిలాండ్ నుండి ఒక కుటుంబం 2025, అక్టోబరు 4వ తేదీ శనివారంనాటి సర్వసభ్య సమావేశం యొక్క ఉదయకాల సభను వీక్షిస్తోంది.
-
ఈక్వెడార్ నుండి ఒక అమ్మాయి 2025, అక్టోబరు 5వ తేదీ ఆదివారంనాటి సర్వసభ్య సమావేశం యొక్క ఉదయకాల సభలో, సర్వసభ్య సమావేశపు రంగులద్దే పేజీలకు రంగులు వేస్తోంది.
-
మడగాస్కర్ నుండి ఒక కుటుంబం 2025, అక్టోబరు 4వ తేదీ శనివారంనాటి సర్వసభ్య సమావేశం యొక్క ఉదయకాల సభను వీక్షిస్తోంది.
| 1 / 2 |
వ్రతదినము అంటే ఏమిటి?
శనివారం ఉదయం జరిగే వ్రతదినము మరో ముఖ్యమైన ఘట్టం — ఇది కొత్త సంఘాధ్యక్షుడిని మరియు ప్రథమ అధ్యక్షత్వాన్ని ఆమోదించడానికి కడవరి దిన పరిశుద్ధులకు లభించే ఒక అవకాశం.
వ్రతదినములు అనేవి వివిధ రకాల పరిశుద్ధ ఉద్దేశ్యాల కోసం నిర్వహించబడే ప్రత్యేకమైన, పవిత్రమైన సమావేశాలు. అవి సమావేశంలోకి ఉన్నతమైన ఆధ్యాత్మిక భావనను తీసుకువస్తాయి. వ్రతదినములలో కొత్త సంఘాధ్యక్షుడిని ఆమోదించడం (ఏప్రిల్ 4వ తేదీ ఉదయం జరగనున్నట్లుగా), ఒక దేవాలయాన్ని ప్రతిష్ఠించడం, ప్రత్యేక స్మారక కార్యక్రమాలు మరియు ఇతర పవిత్ర ప్రయోజనాలు ఉన్నాయి.
కొన్ని వ్రతదినములు (ఉదాహరణకు, ఏప్రిల్ 2020లో) కొత్త నిబంధన మూలాలు కలిగిన ఒక ప్రతీకాత్మక చర్య అయిన హోసన్నా కేకను ప్రదర్శించాయి. ఏప్రిల్ 4వ తేదీన జరిగే వ్రతదినములో హోసన్నా కేక ఉండదు.
నవీకరించబడిన సభ వివరాల జాబితా
సభ్యసమావేశ నిర్దిష్టరూపంలో ఇటీవలి సర్దుబాట్ల తరువాత, 2026 ఏప్రిల్ సర్వసభ్య సమావేశంలో శనివారం సాయంకాల సభ ఉండదు. సభ్యసమావేశంలో విశ్వాసానికి చెందిన వ్యక్తులు, కుటుంబాలు మరియు స్నేహితులందరి కోసం నాలుగు సార్వజనిక సభలు ఉంటాయి.
ఈ సభ్యసమావేశం 70కి పైగా భాషలలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది, తద్వారా ప్రపంచంలో ఎక్కడున్న ప్రజలైనా చిన్న, పెద్ద సమావేశాలలో, ఇళ్లలో మరియు కుటుంబ వాతావరణాలలో దీనిని వీక్షించగలరు.
తర్వాత నేను ఎలా చూడగలను లేదా వినగలను?
ప్రసారం అనంతరం, ఈ సందేశాలు టెక్స్ట్, ఆడియో మరియు వీడియో రూపాల్లో, గరిష్టంగా 98 భాషలలో, పలు ఛానెళ్లలో అభ్యర్థన మేరకు వీక్షించడానికి మరియు అధ్యయనం చేయడానికి అందుబాటులో ఉంటాయి. ఈ ఛానెళ్లలో సువార్త గ్రంథాలయం, మీడియా లైబ్రరీ, ది జనరల్ కాన్ఫరెన్స్ యూట్యూబ్ ఛానెల్ మరియు సంఘ పత్రికలు ఉన్నాయి.